ICC T20 Batting Ranking:ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీ20 ర్యాంకింగ్స్‌లో నెం. 1స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో హెడ్ 844 రేటింగ్స్‌తో నాలుగు స్థానాలు ఎగబాకి టాప్‌లోకి దూసుకొచ్చాడు. దీంతో సుదీర్ఘ కాలంగా అగ్రస్థానంలో ఉన్న టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యదవ్ రెండో స్థానానికి పడిపోయాడు. స్వల్ప తేడాతో సూర్య (842 రేటింగ్) నెం.2లో కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ (672 రేటింగ్స్) 7వ పొజిషన్లో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (616 రేటింగ్స్) 19వ ప్లేస్‌లో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 13స్థానాలు మెరుగుపర్చుకొని (527 రేటింగ్స్) 38వ పొజిషన్లో కొనసాగుతున్నాడు.
నెం.1 ప్లేస్ నుంచి సూర్య డౌన్- టాప్‌లోకి ఆ స్టార్ బ్యాటర్!
Published : Jun 26, 2024, 3:08 PM IST
|Updated : Jun 26, 2024, 3:13 PM IST
ICC T20 Batting Ranking (Source: Associated Press)
టాప్-5 బ్యాటర్లు
- హెడ్- 844 రేటింగ్స్
- సూర్య- 842 రేటింగ్స్
- ఫిల్ సాల్ట్- 816 రేటింగ్స్
- బాబర్ ఆజమ్- 755 రేటింగ్స్
- మహ్మద్ రిజ్వాన్- 746 రేటింగ్స్
Last Updated : Jun 26, 2024, 3:13 PM IST