T20 Ranking 2024:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జైశ్వాల్ 4స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ 743 రేటింగ్స్‌తో 6వ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. దీంతో టీమ్ఇండియా నుంచి సూర్యకుమార్ (2వ స్థానం) తర్వాత జైశ్వాల్ అత్యుత్తమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ ఒక స్థానం కోల్పోయి 684 రేటింగ్స్‌తో 8వ ప్లేస్‌కు పడిపోయాడు. ఇక ఈ ముగ్గురే టీమ్ఇండియా నుంచి టాప్-10లో ఉన్నారు. కాగా, 844 రేటింగ్స్‌తో హెడ్ టాప్‌లో ఉండగా, సూర్య 797 రేటింగ్స్‌తో 2వ స్థానంలోనే కొనసాగుతున్నాడు.
జైశ్వాల్ బెస్ట్ ప్లేస్- దూసుకొచ్చిన గిల్- T20 ర్యాంకింగ్స్ రిలీజ్
Published : Jul 17, 2024, 3:49 PM IST
T20 Ranking 2024 (Source: Getty Images)
మరో యంగ్‌స్టర్ శుభ్‌మన్ గిల్ ఏకంగా 36 స్థానాలు ఎగబాకి (533 రేటింగ్స్) 37వ స్థానం దక్కించుకున్నాడు. కాగా, వాషింగ్టన్ సుందర్ 36స్థానాలు మెరుగుపర్చుకొని 46వ ప్లేస్‌కు చేరుకోగా, పేసర్ ముకేశ్ కుమార్ 21స్థానాలు ఎగబాకి 73వ ర్యాంక్ దక్కించుకున్నాడు.