ఇంగ్లాండ్ క్రికెటర్ అరుదైన ఘనత - 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా!
Published : Sep 7, 2024, 10:52 AM IST
Ollie Pope England Cricketer :ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ఒలీ పోప్ తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.శ్రీలంకతో జరిగిన మూడో టెస్ట్‌లో ఒలీ పోప్ (103*) అజేయ శతకం సాధించాడు. దీని ద్వారా 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ చేయలేని ఓ ఘనతను సాధించాడు. ఇప్పటి వరకూ తన కెరీర్లో ఏడు శతకాలు చేయగా అవన్నీ వేర్వేరు దేశాలపైనే కావడం విశేషం.
ఇక శుక్రవారం వర్షం కారణంగా ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 221/3 స్కోర్ చేయగా, పోప్‌కు తోడుగా బ్రూక్ (8) క్రీజులో ఉన్నాడు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టులో లారెన్స్ (5) వికెట్ త్వరగా కోల్పోగా, ఈ స్థితిలో డకెట్ (86))తో కలిసి పోప్ ఇన్నింగ్స్‌ను సమర్థవంతంగా నడిపించాడు. దీంతో ఈ జోడీ రెండో వికెట్‌కు 95 పరుగులు జత చేసింది.