'ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు నార్త్ కొరియా మద్ధతు'- పుతిన్‌కు కిమ్ ఘన స్వాగతం
Published : Jun 19, 2024, 12:50 PM IST
Putin North Korea Visit : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లారు. ప్యాంగ్యాంగ్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లిన కిమ్, పుతిన్‌కు ఆహ్వానం పలికారు. అనంతరం ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన కార్యక్రమంలో పుతిన్-కిమ్ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌తో సంఘర్షణ నేపథ్యంలో రష్యాకు తమ మద్ధతు ఉంటుందని కిమ్ తెలిపారు. యుద్ధంలో తమ పాలసీలకు మద్ధతు ప్రకటించడంపై కిమ్‌కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. యుద్ధంలో తమకు ఆయుధాలను పంపాలని కిమ్‌ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి బదులుగా ఉత్తర కొరియాకు ఆర్థికంగా, సాంకేతికంగా రష్యా సాయం చేయనున్నట్టు సమాచారం. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో నిత్యం శత్రు దేశాలను కవ్వించే ఉత్తర కొరియా చేతికి అత్యాధునిక సాంకేతికత అందితే మరింత ప్రమాదమని పశ్చిమ దేశాల్లో ఆందోళన నెలకొంది.