తెలంగాణ

telangana

ETV Bharat / snippets

చందమామపై గుహను గుర్తించిన సైంటిస్టులు- ఫ్యూచర్​లో మనుషులు ఉండొచ్చు!

Cave On Moon
Cave On Moon (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 6:56 AM IST

Cave On Moon : జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తాము గుర్తించిన గుహ ఒకింత పెద్దగానే ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశమార్గం ఉన్నట్లు చెప్పారు. 1969లో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్డ్రిన్‌లు దిగిన సీ ఆఫ్‌ ట్రాంక్విలిటీ ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో గుహ ఉందని పేర్కొన్నారు. నాసా ప్రయోగించిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌(LRO) అందించిన రాడార్‌ కొలతలను భూమి మీదున్న లావా సొరంగాలతో పోల్చి చూశారు శాస్త్రవేత్తలు. ఆ ఆకృతి వెడల్పు 130 అడుగులు, పొడవు పదుల మీటర్లలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాంటి ప్రదేశాలు వ్యోమగాములకు సహజసిద్ధ షెల్టర్లుగా అక్కరకొస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. విశ్వం నుంచి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్‌ కిరణాలు, సౌర రేడియోధార్మికత, చిన్నపాటి ఉల్కల నుంచి ఇవి రక్షిస్తాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details