తెలంగాణ

telangana

'ఎక్స్‌' సేవలపై సుప్రీం కోర్టు నిషేధం! VPNల ద్వారా వాడితే రూ.7.5లక్షలు జరిమానా!

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 8:30 AM IST

Court Suspends X Platform In Brazil
Court Suspends X Platform In Brazil (IANS)

Brazil Supreme Court Suspends X Platform :ఎక్స్‌ సేవలపై నిషేధం విధిస్తూ బ్రెజిల్‌ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దేశంలో ఎక్స్​ తమ సంస్థ చట్టపరమైన ప్రతినిధిని నియమించాలన్న బ్రెజిల్‌ ప్రభుత్వ ఉత్తర్వులను, మస్క్‌ పాటించని కారణంగా ఆ ప్లాట్​ఫామ్​ సేవలు నిలిపివేస్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి డీ మోరేస్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఎక్స్ సేవలను బ్లాక్ చేయడానికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లు, యాప్ స్టోర్‌లకు ఐదు రోజుల సమయం ఇచ్చారు. ఎక్స్ ప్లాట్‌ఫారమ్ తమ ఆదేశాలను పాటించే వరకు బ్లాక్ చేయనున్నట్లు తెలిపారు. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (VPN)లను ఉపయోగించి ఎక్స్​ను యాక్సెస్ చేసే వ్యక్తులు లేదా కంపెనీలపై రోజువారీగా 8,900 డాలర్లు(రూ.7,46,621) జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details