ETV Bharat / entertainment

'దేవర' ఖాతాలో మరో సూపర్ రికార్డు - ఆ విషయంలో తొలి తెలుగు సినిమాగా ఘనత - Devara Movie Record - DEVARA MOVIE RECORD

Devara Movie : విడుదలకు ముందే పలు రికార్డులను అందుకుంటున్న 'దేవర' తాజాగా మరో ఘనతను సాధించింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Devara Movie (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2024, 4:25 PM IST

Devara Movie Dolby Atmos UK : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటింటిన 'దేవర' విడుదలకు ముందే పలు రికార్డులను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. యూకేలో డాల్బీ అట్మాస్‌లో ప్రదర్శించనున్న తొలి తెలుగు సినిమా నిలవనుంది. ఈ నెల 26న అక్కడ ప్రీమియర్స్‌ ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేసింది. అలానే లాస్‌ ఏంజెల్స్‌లో నిర్వహించే ప్రతిష్ఠాత్మక బియాండ్‌ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న మొదటి ఇండియన్ సినిమాగానూ దేవర నిలవనుంది.

Devara Movie Promotions : ఇకపోతే దేవర తొలి భాగం మరో తొమ్మిది రోజుల్లో విడుదల కానుంది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్​ రిలీజెస్​ 'కల్కి 2898 ఏడీ', 'సరిపోదా శనివారం' తర్వాత అంతకు మించి అనే స్థాయిలో బాక్సాఫీస్​ దగ్గర అదరగొడుతుందని అంతా ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టే దేవర ఇండియా వైడ్​గా ఆడియెన్స్​కు రీచ్​ అయ్యేందుకు ఎన్టీఆర్ ప్రమోషన్ల కోసం ఎడతెరిపి లేకుండా తిరుగుతూనే ఉన్నారు. ముంబయిలో ట్రైలర్ లాంఛ్​ తర్వాత అలియా భట్, కరణ్ జోహార్, సందీప్ రెడ్డి వంగా, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, సహా పలువురితో స్పెషల్ ఇంటర్వ్యూలను పూర్తి చేశారు.

ట్రెండింగ్​లో ప్రచార చిత్రాలు(Devara Songs Trending) - జనతా గ్యారేజ్‌ లాంటి భారీ హిట్​ తర్వాత ఎన్టీఆర్‌ - కొరటాల శివ కాంబోలో ఈ సినిమా వస్తోంది. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయడం కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన చుట్టమల్లే, దావూదీ సాంగ్స్​ యూట్యూబ్‌లో తెగ ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఆయుధ పూజ సాంగ్​ విడుదలకు సిద్ధమైంది. జాన్వీ కపూర్‌ ఈ చిత్రంతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌ విలన్​గా కనిపించనున్నారు.

'సార్ మీతో సినిమా చేయాలని ఉంది' - కోలీవుడ్ దర్శకుడికి ఎన్టీఆర్ రిక్వెస్ట్​ - Devara NTR

'కూలి' నాగార్జున వైల్డ్​ లుక్​ షూటింగ్​ వీడియో లీక్​ - రోలెక్స్​ తరహాలో క్రూరంగా చంపేస్తూ! - Coolie Nagarjuna Video Leaked

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.