Billionaire Steps Out of SpaceX Capsule: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని 'స్పేస్‌ఎక్స్ అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్‌వాక్‌ను నిర్వహించింది. 'పొలారిస్ డాన్ ప్రాజెక్టు కింద ఫాల్కన్-9 రాకెట్ ద్వారా మంగళవారం నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపింది. వ్యోమగాములతో కూడిన స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సుల్ ప్రస్తుతం భూమి చుట్టూ చక్కర్లు కొడుతోంది.
ఫస్ట్‌టైమ్ అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్‌వాక్- చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్
Billionaire Steps Out of SpaceX Capsule (Associated Press)
Published : Sep 12, 2024, 6:37 PM IST
జేర్డ్ ఇస్సాక్‌మన్, సారా గిల్లిలు ఒకరితర్వాత ఒకరు క్యాప్సుల్ నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్ నిర్వహించారు. స్పేస్‌ఎక్స్ సంస్థ తయారు చేసిన స్పేస్‌సూట్‌ను పరీక్షించారు. వ్యోమగాములు స్పేస్‌వాక్ చేసిన మొదటి ప్రైవేట్ మిషన్ ఇదే. ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్‌ఎక్స్ పరికరాలనే వినియోగించారు.