తెలంగాణ

telangana

అఫ్గాన్​లో భారీ వర్షాలు - 40 మంది మృతి

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 9:29 AM IST

Heavy Rains In Afghanistan
Heavy Rains In Afghanistan (Associated press)

Heavy Rains In Afghanistan : తూర్పు అఫ్గానిస్థాన్​లో భారీ వర్గాల కారణంగా 40మంది మరణించగా, సుమారు 350మంది గాయపడినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. సోమవారం కురిసిన ఈ వానలకు ఓ ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. దాదాపు దాదాపు 400 ఇళ్లు, 60 విద్యుత్తు స్తంభాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అన్నారు. మరో ఘటనలో ఉత్తర బద్​లాన్ ప్రావిన్సులోని కాబుల్, బల్క్​ను కలిపే ప్రధాన రహదారిలో మంగళవారం బస్సు బోల్తా పడి 17మంది మరణించగా, 34మంది గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details