Vijay Devarkonda Ravikiran Kola Movie heroine :విజయ్ దేవరకొండ ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న పట్టుదలతో ఫ్యూచర్ ప్రాజెక్టులపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. దీని తర్వాత విజయ్ దేవరకొండ 'రాజా వారు రాణి గారు' ఫేమ్ రవికిరణ్ కోలాతో చేయనున్నారు. సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది.
కన్నడ భామతో విజయ్ దేవరకొండ రొమాన్స్ - న్యూస్ లీక్!
Published : Jul 27, 2024, 3:53 PM IST
Vijay Devarkonda (source ETV Bharat)
అయితే ఇప్పుడు ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియను మొదలెట్టారట. తాజాగా హీరోయిన్ డీటెయిల్స్ న్యూస్ లీకైంది. ఇందులో కన్నడ భామ రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మొదట సాయి పల్లవి పేరు వినిపించగా ఇప్పుడు రుక్మిణి పేరు వచ్చింది. ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు హీరోయిన్ ఎంతో అందంగా ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.