తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 1:48 PM IST

ETV Bharat / snippets

నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో- YVS డైరెక్షన్​లో డెబ్యూ కన్ఫార్మ్

YVS Janakiram Son
YVS Janakiram Son (Source: ETV Bharat)

Janakiram Son Movie:Tనందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఈ విషయాన్ని టాలీవుడ్ సీనియక్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అధికారికంగా చెప్పారు. 'సీనియర్‌ ఎన్టీఆర్‌ మునిమనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్‌ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును నేను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. హరికృష్ణతో సినిమాలు తీసే అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు ఆయన మనవడిని కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నా' అని వైవిఎస్ అన్నారు. కాగా, సినిమాను వైవిఎస్ భార్య గీత తన సొంత బ్యానర్ (న్యూ టాలెంట్ రోర్స్​)పై నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో నటించనున్న వారి వివరాలు వెల్లడించలేదు.

ఇక 'సీతా రాముల కల్యాణం చూదము రారండి', 'యువరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'సీతయ్య', 'దేవదాస్‌' వంటి ఎన్నో హిట్‌ సినిమాలు తెరకెక్కించారు దర్శకుడు వైవిఎస్‌ చౌదరి. చివరిగా 'రేయ్‌' సినిమా తీశారు.

ABOUT THE AUTHOR

...view details