SSMB 29 Keeravani :టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో రానున్న SSMB29 సినిమా గురించి రోజుకో రూమర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఒక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ, ఎప్పుడెప్పుడూ ప్రకటిస్తారంటూ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రం గురించి తాజాగా ఇచ్చిన ఓ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేసింది.
Published : Jun 23, 2024, 5:19 PM IST
SSMB 29పై కీరవాణి అప్డేట్ - 'మ్యూజిక్ వర్క్ అప్పుడే స్టార్ట్ చేస్తా'
Mahesh Rajamouli Movie (ETV Bharat, Getty Images)
"నేనిప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ వర్క్‌ను స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ వారమే ఈ సినిమా స్టోరీ లాక్ అయింది. టెస్ట్ షూట్స్ కూడా జరుగుతున్నాయి. జులై లేదా ఆగస్టు కల్లా ఈ సినిమా మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేస్తాను" అని కీరవాణి తెలిపారు. దీంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.