Rishab Pant IPL Retention : 2025 ఐపీఎల్ రిటెన్షన్స్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రిషభ్ పంత్‌ను వదులుకోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయంశమైంది. డాషింగ్ బ్యాటర్, వికెట్ కీపర్, కెప్టెన్సీ లక్షణాలున్న ప్లేయర్‌ను దిల్లీ రిటైన్ చేసుకోకపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపర్చింది. తాజాగా దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. పంత్‌కు ఫ్రాంచైజీతో పంత్‌కు ఫీజు విషయంలో డీల్ కుదరలేదేమోనని గావస్కర్ అన్నాడు. స్టార్ స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్‌లో ఈ విధంగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే దీనిపై పంత్ కూడా వెంటనే స్పందించాడు. తన రిటెన్షన్ అంశం డబ్బుతో ముడి పడి లేదని స్పష్టం చేశాడు.
జరిగింది ఇదీ
మరో 5 రోజుల్లో 2025 ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా పంత్ రిటెన్షన్, దిల్లీ క్యాపిటల్స్ స్ట్రాటజీ గురించి మాట్లాడాడు. 'దిల్లీ ఫ్రాంచైజీ పంత్‌ను అట్టిపెట్టుకోవాలని భావించిందేమో. కానీ, రిటెన్షన్స్‌లో ఫీజు విషయంలో ఫ్రాంచైజీకి పంత్‌కు మధ్యలో డీల్ కుదరినట్లు లేదు. ఏ ప్లేయరైనా క్రేజ్ ఉన్నప్పుడు ఎక్కువ ఫీజు ఆశిస్తాడు. అలాగే పంత్ కూడా అడిగి ఉండవచ్చు. పర్స్ వ్యాల్యూ లిమిటేషన్స్ వల్ల ఇద్దరి మధ్య ఒప్పందం కుదినట్లు లేదు. అందుకే అతడిని రిలీజ్ చేయాల్సి వచ్చిందేమో. కానీ, వేలంలో పంత్‌ను కొనుగోలు చేయడానికి దిల్లీ ప్రయత్నిస్తుందనుకుంటున్నా. దిల్లీకి పంత్ అవసరం ఉంది' అని గావస్కర్ అన్నాడు.
అయితే ఈ వీడియోకు పంత్ వెంటనే స్పందించాడు. తన రిటెన్షన్‌కు డబ్బుతో సంబంధం లేదని సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చాడు. 'నా రిటెన్షన్ అంశం డబ్బుతో ముడిపడి లేదని నేను కచ్చితంగా చెప్పగలను' అని పంత్ పోస్ట్ చేశాడు.
My retention wasn’t about the money for sure that I can say 🤍
— Rishabh Pant (@RishabhPant17) November 19, 2024
దిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్స్ 2025
- అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు)
- కుల్‌దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు)
- ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు)
- అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు)
మొత్తం రూ.120 కోట్ల పర్స్ వ్యాల్యూలో దిల్లీ రిటెన్షన్స్ కోసం రూ. 43.75 కోట్లు ఖర్చు చేసింది. ఇక రూ. 76.25 కోట్ల వర్స్ వ్యాల్యూతో మెగా వేలంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే దిల్లీ వద్ద రెండు రైట్ టు మ్యాచ్ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.