ETV Bharat / state

కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి మిథనాల్‌ తయారీ - 'సింగరేణి' మరో వినూత్న వ్యాపారం - METHANOL MANUFACTURE AT SINGARENI

సింగరేణిలో మరో వినూత్న వ్యాపారానికి శ్రీకారం - కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి మిథనాల్‌ ఉత్పత్తి - డిసెంబర్‌ నాటికి పనులు పూర్తి

Methanol Manufacture at Singareni
Methanol Manufacture at Singareni (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2024, 12:52 PM IST

Updated : Nov 19, 2024, 2:51 PM IST

Methanol Manufacture at Singareni : సింగరేణి సంస్థ మరో వినూత్న వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ డయాక్సైడ్ వాయువు నుంచి మిథనాల్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక ప్లాంటును సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఆధారంగా ఏర్పాటు చేస్తోంది. డిసెంబర్‌ నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు సింగరేణి సిద్ధమవుతోంది. ప్రయోగం సఫలమైతే భారీ ప్లాంట్‌ను నిర్మించేందుకు సంస్థ ఆలోచిస్తోంది.

ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి చేసిన సింగరేణి సంస్థ తాజాగా మరో రంగంలోకి అడుగుపెడుతోంది. బొగ్గును మండించగా వెలువడే కార్బన్‌ డైయాక్సైడ్‌తో మిథనాల్‌ ఉత్పత్తికి సిద్ధమైంది. ఇందుకోసం సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గును మండించగా వెలువడే వాయువు నుంచి రోజుకు 500 కేజీల పరిమాణం గల కార్బన్ డయాక్సైడ్‌ను సేకరించనుంది. దీనిని హైడ్రోజన్ వాయువుతో కుదింపు చేసి మిథనాల్ ద్రవాన్ని పొందే ప్రక్రియను థర్మల్‌ ప్లాంట్‌లో చేపట్టనున్నారు. ఈ ప్రయోగాత్మక ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని, డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

థర్మల్ పవర్ ప్లాంట్ అనుబంధంగా ఈ నిర్మాణం : సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు మండించగా వచ్చే కర్బన ఉద్గారాలను 99.9 శాతం వరకు వాతావరణంలో కలవకుండా నివారించడం కోసం ఈఎస్పీ (ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపిటేటర్స్) ను నెలకొల్పారు. ఈ విధానంలో చివరిగా వాతావరణంలోకి పంపించిన వాయువు నుంచి కార్బన్ డయాక్సైడ్ వాయువును స్వీకరిస్తారు. దీన్ని ఉపయోగించి మిథనాల్‌ను తయారు చేస్తారు. థర్మల్ పవర్ ప్లాంట్ చిమ్నికి అనుబంధంగా ఈ ప్రయోగాత్మక ప్లాంట్ నిర్మిస్తున్నారు. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారు చేసే ప్లాంట్‌లో ఇప్పటికే సివిల్ పనులు పూర్తయ్యాయి. వీటిలో కార్బన్ డైయాక్సైడ్‌ను సంగ్రహించే యూనిట్, హైడ్రోజన్ జనరేషన్ యూనిట్, కంప్రెషన్ యూనిట్, మిథనాల్ డిస్టిలేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

బొగ్గు పరిశ్రమ ఫించనుదారులకు కొత్త చిక్కు! - చెల్లింపులకు కొరత?

ప్లాంట్‌కు సంబంధించిన విడివిభాగాలలో కొన్ని ఇప్పటికే నిర్మాణ ప్రాంతానికి చేరుకోగా మరికొన్ని నెలాఖరుకు చేరుకోనున్నాయి. సింగరేణి సారథ్యంలో కోల్ ఇండియా అనుబంధ రీసెర్చ్ యూనిట్ అయిన సెంట్రల్‌ మైన్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌ ఇనిస్టిట్యూట్‌ సీఎమ్‌పీడీఐ ఆర్థిక సహకారంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణ బాధ్యత, ప్లాంట్ నిర్వహణను బెంగళూరుకు చెందిన జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బ్రెత్ అప్లైడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి సుమారు రూ.20 కోట్లు ఖర్చు కానుంది.

ఆర్థికంగా ఎంతో లబ్ధి : ఈ ప్రయోగాత్మక ప్లాంట్‌ ప్రారంభమైతే రోజుకు 180 కేజీల మిథనాల్ తయారీ జరగనుంది. మిథనాల్‌ను ఎరువుల తయారీలో, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాల తయారీ, ప్లైవుడ్, పెయింట్స్ తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు. ప్రయోగం విజయవంతం అయితే వ్యాపార విస్తరణలో భాగంగా పెద్ద ఎత్తున మిథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసి వివిధ పరిశ్రమలకు సింగరేణి సంస్థ అమ్ముకునే అవకాశం ఉంది. దేశీయ అవసరాల కోసం వినియోగిస్తున్న 120 మిలియన్ టన్నుల మిథనాల్‌లో దాదాపు 80 మిలియన్ టన్నులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయంగా ఉత్పత్తి దిశగా ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్లో ఏర్పాటు చేసే ప్లాంట్ల ద్వారా దేశానికి ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయి.

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ - ఈసారి ఎంత ఇచ్చారంటే?

సింగరేణి, జెన్‌కో ఆధ్వర్యంలో రామగుండం విద్యుత్‌ ప్లాంటు - రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - RAMAGUNDAM NEW THERMAL PLANT

Last Updated : Nov 19, 2024, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.