Jio 5G Voucher: దేశంలో టాప్ మొబైల్ నెట్‌వర్క్ రిలయన్స్ జియో తన వినియోగదారులకు సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.601తో సరికొత్త అన్‌లిమిటెడ్ 5జీ అప్‌గ్రేడ్ వోచర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో యూజర్లు ఏడాదంతా అన్‌లిమిటెడ్ 5G డేటా సర్వీసులను వినియోగించుకోవచ్చు. 4G వినియోగదారులు సైతం ఈ వోచర్ సాయంతో 5G సేవలు పొందొచ్చు.
జియో 5G సర్వీసులను తీసుకొచ్చినప్పుడు 5G స్మార్ట్‌ఫోన్, నెట్‌వర్క్ ఉన్న వారందరికీ వెల్‌కమ్ ఆఫర్ కింద ఉచిత 5G డేటాను అందించింది. రూ.239 కంటే ఎక్కువ రీఛార్జి చేసుకున్న వారందరికీ ఈ సదుపాయాన్ని కల్పించింది. అయితే కంపెనీ ఈ ఏడాది జులైలో ప్లాన్ల ధరల సవరణ సందర్భంగా అపరిమిత 5G డేటాకు పరిమితి నిర్దేశించింది. ఎవరైతే రోజుకు 2GB డేటా అందించే ప్లాన్‌ను రీఛార్జి చేసుకుంటారో వారికి మాత్రమే అన్‌లిమిటెడ్ 5G డేటాను ఆఫర్ చేస్తోంది. అంటే నెలకు రూ.349 ప్లాన్ రీఛార్జి చేసే వారికే ఈ ఫ్రీ అన్‌లిమిటెడ్ 5జీ డేటా అందిస్తుందన్న మాట.
అయితే తక్కువ డేటా ప్లాన్ తీసుకునే వారికీ 5G సేవలను అందించేందుకు ఆ మధ్య జియో రూ.51, రూ.101, రూ.151తో బూస్టర్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఏడాది పొడవునా అన్‌లిమిటెడ్ 5G డేటాను అందించేందుకు రూ.601 వోచర్‌ను తెచ్చింది. దీన్ని మై జియో యాప్‌లో కొనుగోలు చేసి అందులోనే యాక్టివేట్ చేసుకోవచ్చు. కావాలంటే ఈ వోచర్‌ను తమ ప్రియమైన వారికి గిఫ్ట్‌లా కూడా పంపుకోవచ్చని జియో చెబుతోంది.
ఇదిలా ఉండగా ఇటీవలే జియో దేశంలోనే చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.11కే 10GB హై స్పీడ్ డేటా ప్లాన్‌ను లాంచ్ చేసింది. జియో తీసుకొచ్చిన ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ రోజువారీ డేటా లిమిట్ అయిపోయాక అదనపు డేటా అవసరమయ్యే యూజర్లకు ఉపయోగపడుతుంది. కానీ దీని వ్యాలిడిటీ కేవలం గంట మాత్రమే ఉంటుంది. అయితే గంటలోపు 10GB డేటా పూర్తయిపోయినా 64kbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. దీనిపై మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కోకాకోలా క్రిస్మస్ యాడ్ వచ్చేసింది- అయితే ఈసారి సీన్ రివర్స్!
రిస్ట్ వాచ్ కాదు.. రింగ్ వాచ్.. ఇది పెట్టుకుంటే మీరే సూపర్ స్మార్ట్!