Sreeleela Bollywood Movie :స్టార్ హీరోయిన్ శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందంటూ నెట్టింట పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. వరుణ్ ధావన్‌తో ఆమె నటించాల్సి ఉండగా, ఆ ప్రాజెక్టును ఆమె రిజెక్ట్ చేసిందంటూ కూడా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై హిందీ నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అసలు సినిమాలో పాత్ర కోసం తాము ఎవ్వరినీ సంప్రదించలేంటూ పేర్కొన్నారు.
వరుణ్ ధావన్‌తో శ్రీలీల మూవీ - క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Published : Aug 2, 2024, 11:26 AM IST
Sreeleela Bollywood Movie (ETV Bharat)
" ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మేము ఎవ్వరినీ అప్రోచ్ అవ్వలేదు. ఇప్పుడే తొలి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే మెయిన్ లీడ్స్‌తో రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేస్తాం. హీరోయిన్గా సెలక్ట్ చేసిన పర్సన్ పేరును త్వరలో అనౌన్స్ చేస్తాం. అప్పటివరకు ఎటువంటి రూమర్స్‌ను నమ్మకండి" అంటూ నిర్మాణ సంస్థ ప్రకటన విడుదల చేసింది.