Sonakshi Sinha Husband Bad Habbit:బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తన భర్త జహీర్ ఇక్బాల్ బ్యాడ్ హ్యాబిట్ గురించి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జహీర్‌కు ఉన్న ఓ అలవాటు తనకు చిరాకు కలిగిస్తుందని సోనాక్షి తెలిపారు. 'జహీర్ విజిల్స్ బాగా వేస్తాడు. మ్యూజిక్ వింటూ విజిల్స్ వేస్తాడు. కానీ, ఆ ఈలల శబ్దం చుట్టూ ఉండేవారికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది' అని సోనాక్షి అన్నారు.
Published : Jul 24, 2024, 9:47 PM IST
నా భర్త అలవాటు ఇబ్బందిగా ఉంది: సోనాక్షి
Sonakshi Sinha (Source: ETV Bharat)
అయితే సోనాక్షి సిన్హా నటించిన లేటెస్ట్ సినిమా 'కాకుడా' జూలై 12న 'జీ 5'లో విడుదలైంది. కామెడీ హార్రర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఇక సోనాక్షి ఇటీవల రిలీజైన 'హీరామండి' వెబ్‌సిరీస్‌లోనూ ప్రేక్షకులను మెప్పించింది. కాగా, గతనెల 23న సోనాక్షి- జహీర్ ఇక్బాల్ వివాహం జరిగింది.