వయసులో చిన్నవాడైన ప్రియుడితో ప్రముఖ హీరోయిన్ పెళ్లికి రెడీ!
Published : Jun 10, 2024, 6:28 PM IST
Actress Sonakshi Sinha Marriage : బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలో పెళ్లిపీటలెక్కబోతుందని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా తనకన్నా వయసులో రెండేళ్లు చిన్నవాడైన జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరు పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. జూన్ 23న ముంబయిలో ఈ జంట వివాహం అత్యంత వైభవంగా జరగనున్నట్లు సమాచారం అందింది. శిల్పాశెట్టి రెస్టారెంట్ బాస్టియన్‌లో జరగనుందట. ఈ వివాహానికి సోనాక్షి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు హాజరుకానున్నారట. ఇప్పటికే ఈ జంట పెళ్లి కార్డు కూడా ప్రింట్ అయిందని, వెడ్డింగ్ కార్డ్‌ను మ్యాగ్జైన్ కవర్లా డిజైన్ చేశారని అంటున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశముంది. కాగా, సోనాక్షి రీసెంట్గా బడే మియా ఛోటే మియా, హీరామండీ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు.