ETV Bharat / offbeat

రన్నింగ్​ బస్​లో నుంచి దూకేసిన మహిళ - భర్త చూస్తుండగానే

నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో ప్రయాణిస్తున్న బస్సులో నుంచి దూకిన మహిళ - తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలింపు

Woman Jumped  bus
Woman Jumped From The Bus In Nirmal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2024, 2:28 PM IST

Woman Jumped From The Bus In Nirmal : నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో ప్రయాణిస్తున్న బస్సులో నుంచి మహిళ దూకింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్​కు ఫోన్ చేసారు. కుటుంబ గొడవల వల్లే తాను బస్సు దూకిందని సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం : నిజామాబాద్​కు చెందిన ఓ కుటుంబం అత్తవారింటికి భైంసా మండలం దేగం గ్రామానికి వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో దేగం గ్రామంలో హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. ముధోల్​లోని కంటి ఆసుపత్రి వద్దకు రాగానే మహిళ ప్రయాణికురాలు ఒక్కసారిగా బస్సులోంచి కిందకు దూకింది. దీంతో తీవ్రగాయాలయ్యాయి. అటువైపు నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే బస్సు డ్రైవర్ బస్సును ఆపాడు. వెంటనే అంబులెన్స్​లో ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దూకడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.