Tech Event in bits Pilani Hyderabad : దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన టెక్ ఈవెంట్ అట్మోస్ - 2024 బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో కొనసాగుతోంది. 2012లో ప్రారంభమైన ఈ వేడుకలు ఏటా జరుగుతున్నాయి. విద్యార్థులకు పరీక్షలే కాదు, ప్రాక్టికల్స్ కూడా ముఖ్యమే. విద్యార్థుల్లోని స్కిల్స్‌ని బయటపెట్టాలంటే అవే అసలైన మార్గాలు. తద్వారా టీం వర్క్, లీడర్ షిప్ వంటివి బలపడతాయి. అలాంటి వాటిని వెలికితీయడానికి బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ అట్మోస్ టెక్నికల్ ఈవెంట్‌ను తీసుకొచ్చింది. ఇందులో విద్యార్థులు తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించారు. ఐస్‌క్రీమ్ పుల్లలతో తయారు చేసిన భవనాల నమూనాలు ఎంతో ఆకట్టుకున్నాయి. దీంతో పాటు అంతరిక్షంలోని గ్రహాలను చూసే టెలిస్కోప్ ఈ సందర్శనలో ఎంతగానో ఆకట్టుకుంది. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
టెలిస్కోప్ ఆవిష్కరణ : విద్యార్థులు తయారు చేసిన సెలిస్ట్రాన్ ఎక్స్‌ఎల్‌టీ 925 టెలిస్కోప్ ఉంది. 'ఇది 9.25 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంది. సాధారణంగా విశ్వంలోని గ్రహాలు అంటే బుధుడు, శని లాంటి గ్రహాలను చూడవచ్చు. ప్రస్తుతం సూర్యుడిని చూడటానికి దీనిని వినియోగిస్తున్నారు. సూర్యుడి నుంచి వచ్చే 99 శాతం కాంతిని ఈ ఫిల్టర్ ద్వారా నియంత్రిస్తుంది. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే సాధారణంగా టెలిస్కోప్ అతి పెద్ద భూతాద్దాలను కలిగి ఉంటుంది. గరిష్ఠంగా 500నుంచి 800 ఎక్స్‌కలిగి ఉంటాయి. వాటితో సూర్యుడిని చూస్తే కళ్లకు ఎంతో ప్రమాదం. అందుకే చాలా వరకు కాంతిని నియంత్రిస్తున్నాం. తద్వారా సూర్యుడి చుట్టూ ఉండే కరోనా పొరను పరిశీలిస్తున్నాం. సూర్యుడిపై మనకు తెలిసిన సోలార్‌స్పాట్‌లను చూస్తున్నాం.' అని విద్యార్థులు వివరించారు.
ఆటోమేటిక్‌గా పని చేయడం ఈ టెలిస్కోప్‌లో ఉన్న ప్రధాన ప్రత్యేకత. మేం ఏం చేశామంటే మూడు నక్షత్రాలను ఒకే వరుస క్రమంలో మ్యానువల్‌గా అమర్చాం. వాటిని గుర్తించిన వెంటనే భూమి నుంచి అవి ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకున్నాం. ఆ ఖగోళ వస్తువులకు సంబంధించిన సమాచారం ఎలాగో ఉంటుంది. కాబట్టి వాటి స్థానం తెలియడంతో విశ్వంలో ఏ వస్తువును గుర్తించినా వెంటనే లాక్‌చేసి అనుసరిస్తాం. వేరే టెలిస్కోప్‌లు అయితే ఎప్పటికప్పుడు సరిచేసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇది గంటలకొద్దీ లేదా రాత్రి మొత్తం అనుసరిస్తూనే ఉంటుంది. దీంతో ఉన్న ప్రధాన ప్రయోజనం ఇదే. - విద్యార్థి
అట్మాస్-2024 : డ్రోన్ రేసింగ్, రోబో వార్ చూస్తారా? - అయితే బిట్స్ పిలానీకి వచ్చేయండి
అట్టహాసంగా అట్మాస్ టెక్ ఫెస్ట్.. పాల్గొన్న సినీ నటుడు అడివి శేష్