33,000 అడుగుల ఎత్తులో సల్మాన్ యాక్షన్!
Published : Jun 11, 2024, 7:10 AM IST
Salman Khan AR Murugadoss Film :బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం సికందర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. నడియాడ్ వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియాడ్వాలా నిర్మిస్తున్నారు. 2025 ఈద్ కానుకగా విడుదల చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన క్రేజీ వార్త ఒకటి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. మొదటి రోజు అతిపెద్ద ఎయిర్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. తొలి షెడ్యూల్లో భాగంగా సల్మాన్‌తో సముద్రమట్టానికి దాదాపు 33,000 అడుగుల ఎత్తులో అద్భుతమైన వైమానిక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్ ఈ ప్రాజెక్టుకే కీలకమైన సన్నివేశమని అంటున్నారు. ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా గడుపుతున్న రష్మికనే ఈ సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది.