ETV Bharat / bharat

సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్‌- హరియాణా పీఠం ఎవరిదో? - Haryana Assembly Election 2024

Haryana Assembly Election 2024 Live Updates
Haryana Assembly Election 2024 Live Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2024, 6:37 AM IST

Updated : Oct 5, 2024, 6:10 PM IST

Haryana Assembly Election 2024 Live Updates : హరియాణా శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. మొత్తం 90అసెంబ్లీ స్థానాల్లో 1031మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 101 మంది మహిళలు ఉన్నారు. 2కోట్లకుపైగా ఓటర్లు ఉండగా వారికోసం 20,629 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఒకే విడతలో పోలింగ్‌ జరగనుండగా ఈనెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

LIVE FEED

6:09 PM, 5 Oct 2024 (IST)

హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాల్లో 1,031 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. శనివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ (Polling) ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల నాటికి దాదాపు 61 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 68 శాతం ఓటింగ్‌ నమోదైంది.

3:59 PM, 5 Oct 2024 (IST)

  • హరియాణాలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌
  • మధ్యాహ్నం మూడు గంటల వరకు 49.13 శాతం పోలింగ్‌ నమోదు
  • హరియాణా: సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌

2:09 PM, 5 Oct 2024 (IST)

బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

ప్రస్తుతం హరియాణా శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. అయితే ఈ పోలింగ్​లో హింసాత్మక ఘటన జరిగింది. హిసార్​ నియోజకవర్గంలోని నార్నాడ్ ప్రాంతంలో పోలింగ్ బూత్ బయట బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో పోలీసు అధికారులు పరిస్థితిని అదుపుచేసందుకు ప్రయత్నించారు.

2:00 PM, 5 Oct 2024 (IST)

  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.69 శాతం పోలింగ్‌ నమోదు

11:56 AM, 5 Oct 2024 (IST)

  • ఉదయం 11 గంటల వరకు 22.70 శాతం పోలింగ్‌ నమోదు

11:04 AM, 5 Oct 2024 (IST)

స్వంతంత్ర అభ్యర్థిపై మాజీ ఎమ్మెల్యే దాడి!

హరియాణా మెహమ్​ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్​ కేంద్రం ఘర్షణ వాతావరణం నెలకొంది!. ఇండిపెండెంట్​గా పోటీ చేస్తున్న బాల్​రాజ్​ కుండు, తనతో పాటు తన పీఏపై- మాజీ ఎమ్మెల్యే అనంద్​ సింగ్ డంగి, ఆయన అనుచరులు దాడి చేశారని ఆపోరించారు. ఈ స్థానంలో కాంగ్రెస్​ టికెట్​పై ఆనంద్ సింగ్ కుమారుడు బలరామ్​ డంగి పోటీ చేస్తున్నారు.

10:29 AM, 5 Oct 2024 (IST)

వినూత్నంగా గుర్రంపై వచ్చి ఓటేసిన బీజేపీ ఎంపీ

వినూత్నంగా పోలింగ్​ కేంద్రానికి గుర్రంపై వచ్చారు బీజేపీ ఎంపీ నవీన్​ జిందాల్. కురుక్షేత్ర నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

9:53 AM, 5 Oct 2024 (IST)

ఉదయం 9 గంటల వరకు 9.53% ఓటింగ్

హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 9.53% ఓటింగ్ నమోదైంది.

8:18 AM, 5 Oct 2024 (IST)

ఓటేసిన ప్రముఖులు

  • ఫరీదాబాద్‌లో ఓటేసిన కేంద్రమంత్రి క్రిషన్‌ పాల్‌ గుర్జర్‌, కర్నాల్‌లో ఓటేసిన మరో కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌
  • అంబాలాలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ
  • చాక్రిదాద్రి పోలింగ్‌ కేంద్రంలో ఓటేసిన మాజీ రెజ్లర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి వినేశ్‌ ఫొగాట్‌

7:46 AM, 5 Oct 2024 (IST)

ఓటింగ్​లో రికార్డ్ సృష్టించాలి : మోదీ

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఓటింగ్​లో కొత్త రికార్డును నెలకొల్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.

7:26 AM, 5 Oct 2024 (IST)

ఒలింపిక్ మెడల్ విన్నర్, స్టార్ షూటర్ మను బాకర్ ఝజ్జర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

7:00 AM, 5 Oct 2024 (IST)

పోలింగ్ ప్రారంభం

మొత్తం 90 స్థానాలకు జరుగుతున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

6:26 AM, 5 Oct 2024 (IST)

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పోలింగ్​ కేంద్రాల్లో అధికారులు మాక్​ పోలింగ్​ ప్రారంభమైంది. తనేసర్​ నియోజకవర్గంలోని 66, 65 పోలింగ్​ బూత్​ల్లో మాక్ పోలింగ్​ను నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి అశోక్​ కుమార్ అరోరా, కృష్ణన్ బజాజ్​, బీజేపీ నుంచి సుభాశ్​ సుధ, జేజేపీ నుంచి ప్రతాప్​ సింగ్ రాథోఢ్​ బరిలో ఉన్నారు.

Last Updated : Oct 5, 2024, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.