ETV Bharat / technology

మార్కెట్లోకి ఒకేరోజు రెండు కియా లగ్జరీ కార్లు- ధర, ఫీచర్లు ఇవే..! - Kia Cars Launched in India - KIA CARS LAUNCHED IN INDIA

Kia Cars Launched in India: ప్రముఖ కార్ల తయరీ కంపెనీ కియా మోటార్స్‌ తన సరికొత్త లగ్జరీ కార్లను లాంచ్ చేసింది. అత్యాధినిక హంగులతో డిజైన్​ చేసిన వీటిపై మరిన్ని వివరాలు మీకోసం.

Kia Cars Launched in India
Kia Cars Launched in India (Kia)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 4, 2024, 3:41 PM IST

Updated : Oct 4, 2024, 4:35 PM IST

Kia Cars Launched in India: దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా మోటార్స్‌ భారత్‌లో రెండు విలాసవంతమైన కార్లను లాంచ్ చేసింది. వీటిల్లో విద్యుత్తు ఆధారంగా పనిచేసే ఈవీ9 SUVని మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇక ఇప్పటికే భారత మార్కెట్‌కు సుపరిచితమైన కియా కార్నివాల్‌ లగ్జరీ ఎంపీవీ సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. పలు అత్యాధునిక హంగులతో రూపొందించిన ఈ కార్లపై మరిన్ని వివరాలు మీకోసం.

భారత్‌కు 'వరల్డ్‌ కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2024':

  • వరల్డ్‌ కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2024గా ఈ ఏడాది కియా ఈవీ9 నిలిచింది. ఆకర్షణీయమైన బాక్సీ షేప్‌లో దీనిని తీర్చిదిద్దారు. ముందువైపు డిజిటల్‌ టైగర్‌ ఫేస్‌ డిజైన్‌తో తీర్చిదిద్దారు. ఈ సరికొత్త కారుకు స్లీక్ LED హెడ్‌లైట్స్‌, స్టార్‌మ్యాప్‌ LED అసెంట్స్‌ అదనపు ఆకర్షణలు తెచ్చాయి.
  • ఈ ఈవీ9 కారు 350 కేవీ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో 10-80శాతం ఛార్జింగ్‌ కేవలం 24 నిమిషాల్లో పూర్తి చేసుకోగలదు.
  • 5.3 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం విశేషం. 700 టార్క్ వద్ద ఈ కారు మొత్తంలో 282.6 కిలోవాట్స్‌ పవర్‌ అవుట్‌పుట్‌ను విడుదల చేస్తుంది. 198 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌ దీని సొంతం.

కియా కనెక్ట్‌ 2.0 సిస్టమ్​: ఈ కారులో కియా కనెక్ట్‌ 2.0 సిస్టమ్​ను అమర్చారు. స్మార్ట్‌ఫోన్లతో కనెక్ట్‌ అయి ఇది రియల్‌టైమ్‌ అప్‌డేట్స్‌, రిమోట్‌ కంట్రోల్‌ ఫీచర్‌ను అందిస్తుంది. ఈవీ9 కారులోని 44 కంట్రోలర్స్‌ను రిమోట్‌గా ఆపరేట్‌ చేయవచ్చు. మొబైల్​ ఫోన్‌ ఆధారంగా పనిచేసే డిజిటల్‌ కీ 2.0 వెర్షన్‌ ఈ కారుకు అమర్చారు.

Kia EV9
Kia EV9 (Kia)

భద్రతా ఫీచర్లు:

  • 24 అటానమస్‌ అడాస్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు.
  • 10 ఎయిర్ బ్యాగ్‌లు ఈ కారుకు ఉన్నాయి.
  • యూరోఎన్‌క్యాప్‌, ఏఎన్‌క్యాప్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ను సాధించింది.

ఇతర ఫీచర్లు:

  • 12.3 హెచ్‌డీ డిస్‌ప్లే ఇనుస్ట్రుమెంట్‌ క్లస్టర్‌
  • అత్యాధునిక ట్రినిటీ పనోరమిక్‌ డిస్‌ప్లే
  • 5 అంగుళాల హెచ్‌డీ హెచ్‌వీఏసీ స్క్రీన్‌
  • 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో ఎంటర్‌టైన్మెంట్‌ సిస్టమ్‌

కియా ఈవీ9 ధర: రూ.1.3 కోట్లు (ఎక్స్‌షోరూమ్‌)

లగ్జరీ ప్యాకేజీగా 'కార్నివాల్‌' సెకండ్‌ ఇన్నింగ్స్‌:

Kia Carnival
Kia Carnival (Kia)
  • సరికొత్త హంగులతో కియా కార్నివాల్‌ ఇండియన్ కస్టమర్లను మరోసారి పలకరించింది.
  • ఈ సారి ఈ కారులో అన్ని ఫీచర్లతో కలిసి లిమోసిన్‌ ప్లస్‌ వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చారు.
  • ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో దీనికి పోటీనే లేదు.
  • ఈ సరికొత్త కార్నివాల్‌కు తాజాగా 24 గంటల్లోనే 1,822 బుకింగ్స్ రావడం విశేషం.

ఇంజిన్: ఈ కారులో స్మార్ట్‌ స్ట్రామ్‌ 2.2 లీటర్స్ 4 సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 193 పీఎస్‌ పవర్, 441 టార్క్‌ను రిలీజ్ చేయగలదు. 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ను దీనికి జతచేశారు. ఈ కారులో ఎకో, నార్మల్‌, స్పోర్ట్‌, స్మార్ట్‌ డ్రైవ్‌మోడ్స్ ఉన్నాయి. ఈ లిమోసిన్‌ 5,155 ఎంఎం పొడవు, 1,995 ఎంఎం వెడల్పు, 1,775 ఎత్తుతో భారీగా కనిపిస్తుంది. క్యాబిన్‌లో 2+2+3 సిటింగ్‌ ఉంది.

కారు ముందు వైపు ఫీచర్లు:

  • కియా టైగర్‌ నోస్‌ గ్రిల్‌
  • ఐస్‌క్యూబ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌
  • స్టార్‌మ్యాప్‌ డీఆర్‌ఎల్‌లు
  • ఎల్‌ఈడీ ఫాగ్‌ ల్యాంప్స్‌

కారు వెనక వైపు ఫీచర్లు:

  • హిడెన్‌ వైపర్‌
  • ఎల్‌ఈడీ ల్యాంప్‌లు
  • 18 అంగుళాల డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్‌ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్:

Kia Carnival
Kia Carnival (Kia)
  • గ్లేసియర్‌ వైట్‌ పెరల్‌
  • ఫ్యూజన్‌ బ్లాక్‌

ఇంటీరియర్‌:

  • కారులో డ్యూయల్‌ టోన్‌ ఇంటీరియర్‌ కనువిందు చేస్తుంది.
  • దీనిలో 12వే పవర్‌ డ్రైవర్‌ సీట్‌, ఫ్రంట్‌ సీట్‌లో వెంటిలేషన్‌, హీటింగ్‌ సౌకర్యాలను తీసుకొచ్చారు.
  • రెండో వరుసలో పై రెండు ఫీచర్లతోపాటు లెగ్‌ సపోర్టు కూడా ఉంది.

మరిన్ని ఫీచర్లు:

  • ఈ కొత్త కారులో 3జోన్‌ ఫుల్లీ ఆటోమేటిక్‌ టెంపరేచర్‌ కంట్రోల్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌/క్లైమెంట్‌ కంట్రోల్‌ స్వాప్‌ స్విచ్‌, స్మార్ట్‌ పవర్‌స్లైడింగ్‌ డోర్స్‌ ఉన్నాయి.
  • డ్యూయల్‌ పనోరమిక్‌ డిస్‌ప్లేను అమర్చారు.
  • వీటిల్లో ఒక్కోటి 12.3 అంగుళాలు ఉంటాయి. 12 బోస్‌ స్పీకర్లు, 64 వర్ణాల్లో యాంబియంట్‌ మూడ్‌ లైటింగ్‌ వినియోగదారులకు లభిస్తాయి.

భద్రతా ఫీచర్లు:

  • ఎనిమిది ఎయిర్‌ బ్యాగ్‌లు
  • ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌
  • హిల్‌ అసిస్టెంట్‌ కంట్రోల్‌
  • నాలుగు డ్రిస్క్‌బ్రేక్‌లు
  • ఎమర్సెన్సీ స్టాప్‌ సిగ్నల్‌
  • వెహికల్‌ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌
  • పార్కింగ్‌ డిస్టెన్స్ వార్నింగ్‌
  • అడాస్‌ లెవల్‌-2లో 23 అటానమస్‌

కియా కార్నివాల్‌ ధర: రూ. 63.90 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)

మార్కెట్లో మహీంద్రా థార్ 'రాక్స్'- గంటలోనే 1.76 లక్షలకు పైగా బుకింగ్స్ - Mahindra Thar ROXX Bookings

స్టన్నింగ్ టైగర్ లుక్స్​తో కొత్త రేంజ్ రోవర్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - Range Rover SV New Edition

Last Updated : Oct 4, 2024, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.