తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 9:11 AM IST

ETV Bharat / snippets

'రానా నాయుడు' స్పెషల్ అవార్డు - బెస్ట్ యాక్టర​గా పురస్కారం

Rana Naidu Actor Rana
Rana (ETV Bharat)

Rana Best Actor Award : టాలీవుడ్ స్టార్ హీరో రానాను తాజాగా బెస్ట్ యాక్టర్​ అవార్డు వరించింది. ఆయన నటించిన 'రానా నాయుడు'కు గానూ 'ఇండియన్‌ టెలీ అవార్డ్స్ 2024'లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే రానా గైర్హాజరీ కారణంగా ఆయన తరఫున ఈ అవార్డును సిరీస్‌ డైరెక్టర్‌ తీసుకున్నారు.

ఇదిలా ఉండగా, ఈ విషయంపై రానా ఆనందం వ్యక్తం చేశారు. అవార్డుకు ఎంపిక కావడం గౌరవంగా ఉందని పేర్కొన్నారు.

అమెరికన్‌ టీవీ సిరీస్‌ 'రే డొనోవన్‌'కు రీమేక్‌గా ఈ సిరీస్ రూపొందింది. ఇందులో రానా, వెంకటేశ్‌ మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. యాక్షన్‌, క్రైమ్‌ నేపథ్యంలో సాగిన ఈ సిరీస్‌లో తండ్రీ కొడుకులుగా కనిపించారు. కంటెంట్ విషయంలో పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో ఇది చరిత్ర సృష్టించింది. గ్లోబల్‌ స్థాయిలోనూ ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకున్న సిరీసుల్లో టాప్​ ప్లేస్​లో నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details