Prabhas Rajasaab Auditions :పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో 'రాజాసాబ్' ఒకటి. మారుతి దర్శకుడు. ప్రస్తుతం సినిమాలోని కొన్ని కీలక సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారట. ప్రభాస్ జులై చివరి వారంలో సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని తెలిసింది. అయితే ఈ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే అందులో నిజం లేదట. మేకర్స్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. "సోషల్ మీడియాలో రాజాసాబ్ ఆడిషన్స్ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. అదంతా ఫేక్. ఇలాంటి చర్యలను దయచేసి ప్రోత్సహించకండి. ఏదైనా ఉంటే మేమే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాం." అని పేర్కొన్నారు.
ప్రభాస్ 'రాజాసాబ్' - ఆ ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు
Published : Jul 5, 2024, 4:04 PM IST
Prabhas Rajasaab Auditions (source ETV Bharat)
సినిమాలో నిధిఅగర్వాల్, మాళవిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధికుమార్, సంజయ్‌దత్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. 2025 నాటికి సినిమా పూర్తి చేసి, రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.