తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 5:08 PM IST

ETV Bharat / snippets

వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం - వరుడు ఎవరంటే?

Arjun Daughter Wedding
Arjun Daughter Wedding (ETV Bharat)

Arjun Daughter Wedding :యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కుమార్తె ఐశ్వర్య వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఆమె వివాహబంధంలోకి అడుగుపెట్టింది. చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

జూన్ 7న హల్ది కార్యక్రమంతో ప్రారంభమైన ఈ వేడుక, జూన్ 8 సంగీత్ ఇలా పలు ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్స్​తో సందడిగా సాగింది. ఆ తర్వాత జూన్ 10న సినీ ప్రముఖుల, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. కాగా వీరి రిసెప్షన్ జూన్ 14 న చెన్నైలోని లీలా ప్యాలెస్​లో గ్రాండ్​గా జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details