'ఆడవాళ్లను బూతులు తిట్టడం వచ్చు' - ఆ హీరోపై అనసూయ షాకింగ్ కామెంట్స్!
Published : Jul 25, 2024, 12:48 PM IST
Anasuya VijayDevarkonda Controversy : యాంకర్ అనసూయ డైరెక్ట్‌గా లేదా ఇండైరెక్ట్‌గా విజయ్‌దేవరకొండపై పలు సార్లు ట్వీట్లు చేసి ట్రోలింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇలానే చేసిందని అంటున్నారు నెటిజన్లు! అనసూయ నటించిన సింబా రిలీజ్‌కు రెడీ అయింది. ఈక్రమంలోనే ప్రెస్మీట్లో పాల్గొనగా ఆమెకు విజయ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై ఘాటుగానే స్పందించిన అనసూయ మళ్లీ సోషల్‌మీడియాలోనూ పోస్ట్ చేసింది. "మరీ ఇంత చేతకాని వాళ్లలాగ ఉంటే ఎలాగండి. నిజంగా మీకు కాలుతుందంటే నా మీదకాదు, అస్తమానం నేను ఏ పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్లని అనండి దమ్ముంటే. కానీ మీరు అలాచెయ్యరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలాగ ఆడవాళ్లను ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం. మీలాంటి వాళ్లు అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. గెవ్ వెల్‌సూన్. పని చూసుకోండి!" అని రాసుకొచ్చింది.