Allu Arjun New Movie :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే దీని తర్వాత ఆయన అప్‌కమింగ్ మూవీస్ గురించి ఇంకా క్లారిటీ లేదు. ఆయన కూడా ఇంకా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కానీ, గతంలో సందీప్‌రెడ్డి వంగా, అట్లీ, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లు బన్నీకి కథలు వినిపించారంటూ టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ 'పుష్ప2'లో నటిస్తూనే తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Published : Jul 16, 2024, 6:46 AM IST
బన్నీ కోసం రజనీ డైరెక్టర్!- మాటల మాంత్రికుడి కథ ఏమైందంటే?
Allu Arjun (ETV Bharat)
ఇదిలా ఉండగా, తాజాగా బన్నీని మరో స్టార్ డైరెక్టర్ కలిసి స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనేవరో కాదు 'జైలర్' డైరెక్టర్ నెల్సన్. ఇప్పుడు ఈ కాంబో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్ కూడా బన్నీతో ఓ మైథాలజీకల్ మూవీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి 'పుష్ప 2' తర్వాత బన్నీ ఏ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో?