IPL 2025 Auction Rules : 2025 ఐపీఎల్ వేలానికి సంబంధించి రూల్స్ ఎలా ఉండనున్నాయని క్రికెట్ ఫ్యాన్స్‌లో రోజురోజుకు ఆసక్తి పెరిగిపోతోంది. ఈ మెగా వేలంగా రిటెన్షన్ పాలసీ ఎలా ఉండనుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయమై బీసీసీఐ ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీల సలహాలు, అభిప్రాయాలు సేకరించింది. తాజాగా బెంగళూరులో జరిగిన బీసీసీఐ జనరల్ మీటింగ్‌లో 2025 ఐపీఎల్ వేలానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు వేలం నిబంధనలు ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.
కొత్త రిటెన్షన్ పాలసీ విధానంలో రైట్ టు మ్యాచ్ కార్డ్ (Right To Match Card) విధానాన్ని బీసీసీఐ తిరస్కరించినట్లు తెలిసింది. అన్ని ఫ్రాంచైజీలు గరిష్ఠంగా ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. అందులో ముగ్గురు దేశీయ, ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉండవచ్చు. ఈ మేరకు బీసీసీఐ కొత్త రిటెన్షన్ పాలసీని త్వరలోనే అధికారికంగా వెల్లడించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే మెగా వేలానికి ముందు ప్లేయర్ల రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ కార్డ్ విధానంపై ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కోలా బీసీసీఐకి సుచనలు చేశాయి. పలు ఫ్రాంచైజీలు ఎనిమిది మంది ప్లేయర్లను లేదా 2 రైట్ టు మ్యాచ్ కార్డ్ అప్షన్లు ఇవ్వాల్సిందిగా బీసీసీఐని కోరినట్లు తెలిసింది. కానీ, అవేవీ లేకుండా కేవలం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం కల్పించాలని బీసీసీఐ తాజా సమావేశంలో నిర్ణయించినట్లు క్రీడావర్గాల సమాచారం.
కాగా, రైట్ టు మ్యాచ్ కార్డ్ ఆప్షన్ అనుమతి ఇస్తే, ఏదైనా జట్టు తమ ప్లేయర్‌ను కొనుగోలు చేస్తే అదే ధరను సదరు ఫ్రాంచైజీకి చెల్లించి ఆటగాడిని తిరిగి తీసుకోవచ్చు. అలా ఆర్టీఎమ్ కార్డు ఉపయోగించి వేలంలో కోల్పోయిన ప్లేయర్లను ఫ్రాంచైజీలు తిరిగి దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆర్టీఎమ్ పాలసీని బీసీసీఐ చివరిసారిగా 2018లో అనుమతించింది. ఇక ఈ మెగా వేలాన్ని ఈ ఏడాది నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
NO RTM CARD FOR IPL 2025.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 25, 2024
- The BCCI set to allow 5 retentions without any RTM card for IPL 2025 Auction. (Express Sports). pic.twitter.com/eG0AcbqzQh