తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jul 25, 2024, 11:48 AM IST

ETV Bharat / snippets

రౌండ్ 2 - మరోసారి తల్లి కాబోతున్న ప్రణీత

source ETV Bharat
Actress Pranitha subhash Second time Pregnant (source ETV Bharat)

Actress Pranitha subhash Second time Pregnant :బాపుగారిబొమ్మ అంటూ అత్తారింటికి దారేదితో టాలీవుడ్ ఆడియెన్స్​ను ఫిదా చేసిన నటి ప్రణీత మరోసారి గుడ్​న్యూస్ చెప్పింది. తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు బేబీ బంప్ ఫొటోలను షేర్‌ చేసింది. రౌండ్ 2 ఈ దుస్తులు ఇప్పుడిక సరిపోవు అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. దీంతో పలువురు సినీప్రముఖులు, అభిమానులు ఆమెకు కంగ్రాట్స్​ చెబుతున్నారు.

కాగా, ఏం పిల్లో, ఏం పిల్లడోతో టాలీవుడ్‌కు పరిచయమైన ప్రణీత ఆ తర్వాత అత్తారింటికి దారేది, రభస, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. కరోనా టైమ్​లో పేదల కోసం తనవంతు సాయం చేసి ప్రశంసలను అందుకుంది. అనంతరం బెంగళూరుకు చెందిన బిజినెస్​మెన్​ నితిన్‌ రాజును 2021లో పెళ్లి చేసుకుంది. వీరికి 2022 జూన్‌లో పండంటి ఆడబిడ్డ జన్మించింది.

ABOUT THE AUTHOR

...view details