తెలంగాణ

telangana

వాయిస్ ఓవర్ ఓకే- మరి రోల్ ఎందుకు రిజెక్ట్?

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 12:01 PM IST

Keerthy Suresh Kalki Movie
Keerthy Suresh Kalki Movie (Source: ETV Bharat)

Keerthy Suresh Kalki Movie:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ లేటెస్ట్ బాక్సాఫీస్ హిట్ 'కల్కి' సినిమాలో రోల్ ఆఫర్ రిజెక్ట్ చేశారంట. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తనకు ఆఫర్ చేసిన ఓ రోల్​ను ఆమె తిరస్కరించానని తెలిపారు. 'కల్కిలో ఓ పాత్ర కోసం డైరెక్టర్ నన్ను సంప్రదించారు. కానీ, నేను ఆ రోల్ చేయలేనని చెప్పాను. అయితే ఈ ప్రాజెక్ట్​లో భాగమవ్వడం ఇష్టమేనని మెసేజ్ చేశా. తర్వాత సినిమాలో 'బుజ్జి' రోల్​కు వాయిస్ ఇవ్వాలని అన్నారు. మొదట అర్థం కాలేదు. షూటింగ్​లో నేను పాల్గొనాల్సిన అవసరం లేదా? అని అడిగా. లేదు కేవలం వాయిస్‌ ఓవర్‌ ఇస్తే చాలన్నారు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే ఓకే చెప్పేశా' అని కీర్తి సురేశ్ అన్నారు. అలా బుజ్జికి వాయిస్ ఇవ్వడం సంతోషంగా ఉందన్న కీర్తి, నాగ్ అశ్విన్ ఆఫర్ చేసిన రోల్ గురించి మాత్రం చెప్పనన్నారు.

ABOUT THE AUTHOR

...view details