Border Gavaskar Trophy Two Fast Bowlers As Captain : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ పెర్త్ వేదికగా ప్రారంభమైంది. అయితే ఈ పెర్త్ టెస్ట్‌కు ఓ అరుదైన ఘనత దక్కింది. అదేంటంటే ఇరు జట్లకు బౌలర్లే సారథ్యం వహించడం విశేషం. 1947 తర్వాత ఇరు జట్ల సారథులు బౌలర్లే కావడం ఇదే మొదటి సారి. భారత జట్టుకు జస్‌ప్రీత్ బుమ్రా, ఆసీస్‌కు ప్యాట్ కమిన్స్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. రోహిత్ గైర్హాజరీలో బుమ్రాకు జట్టు పగ్గాలు దక్కాయి. గతంలో 1947/48 భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ జట్టును సర్ డొనాల్డ్ బ్రాడమన్ సారథ్యం వహించగా, భారత జట్టుకు లాలా అమరనాథ్ కెప్టెన్‌గా ఉన్నారు. ఈ సిరీస్‌లో భారత్ 0-4 తేడాతో ఓడిపోయింది.
ఇకపోతే ఈ పెర్త్ టెస్ట్ సారథులు బుమ్రా, కమిన్స్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు కూడా. సాధారణంగా క్రికెట్ చరిత్రలో ఫాస్ట్ బౌలర్లు సారథ్య బాధ్యత వహించడం అనేది చాలా అరుదు. గత 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ఇరు జట్లకు ఫాస్ట్ బౌలర్లే సారథ్యం వహించిన సందర్భాలు 6 సార్లు మాత్రమే జరిగింది.
ఆ ఆరు సార్లు జరిగిన మ్యాచులు ఇవే
బాబ్ విల్లీస్ (ఇంగ్లాండ్) VS ఇమ్రాన్ ఖాన్ (పాకిస్థాన్), 1982 (బర్మింగ్‌హామ్)
వసీం అక్రమ్ (పాకిస్థాన్) VS కోర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్), 1997 (ప్రొఫెషనల్)
హీత్ స్ట్రీక్ (జింబాబ్వే) VS షాన్ పొల్లాక్ (దక్షిణాఫ్రికా), 2001 (బులవాయో)
జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) VS సురంగ లక్మల్ (శ్రీలంక), 2018 (బ్రిడ్జ్‌టౌన్)
పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా) VS టిమ్ సౌథీ (న్యూజిలాండ్), 2024 (క్రిస్ట్‌చర్చ్)
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) VS జస్ప్రీత్ బుమ్రా ( టీమ్ఇండియా), 2024 (పెర్త్)*
బుమ్రా, కమిన్స్ కెప్టెన్సీలు రికార్డులు
కమిన్స్, ఆసీస్ జట్టు ఫుల్ టైమ్ టెస్ట్, వన్డే కెప్టెన్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్లో తమ జట్టును గెలిపించాడు. వన్డే వరల్డ్ కప్ 2023లోనూ గెలిపించాడు. మొత్తంగా 28 టెస్టులకు సారథ్యం వహించగా, అందులో 17 విజయాలు, 6 ఓటములు ఉన్నాయి. 5 మ్యాచులు డ్రాగా ముగిశాయి.
బుమ్రా సారథ్యం వహించడం ఇది రెండో సారి మాత్రమే. తొలిసారి సారథ్యం వహించినప్పుడు జట్టును గెలిపించలేకపోయాడు.
జడేజా, అశ్విన్ లేకుండానే తొలి టెస్ట్ - వీరిని కాదని సుందర్‌నే ఎందుకు తీసుకున్నారంటే?