Nvidia Suffers Massive Losses : అమెరికన్ టెక్నాలజీ కంపెనీ 'ఎన్వీడియా కార్పొరేషన్' మంగళవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఏకంగా 9.5 శాతం మేర నష్టపోయింది. అంటే ఒక రోజులో ఏకంగా 279 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయింది. ఎన్వీడియా షేర్ ధర ఒక రోజులో ఇంతగా క్షీణించడం ఇదే మొదటిసారి. దీనితో మదుపరులు భారీగా నష్టపోయారు.
కుదేలైన Nvidia షేర్స్ - ఒక్క రోజులోనే 10% క్రాష్ - కారణం ఇదే!
Published : Sep 4, 2024, 11:58 AM IST
Nvidia (ETV Bharat)
ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఇటీవల లింక్డ్ఇన్ అప్డేట్తో వార్తల్లో నిలిచారు. ఈ ఏఐ హెవీ వెయిట్ కంపెనీ తమ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోంది. పైగా కంపెనీ వ్యాపారం కూడా అనుకున్న స్థాయిలో రాణించడంలేదు. ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఎన్వీడియా షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఇదే విధంగా మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ (గూగుల్) కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లో నష్టాలు చవిచూస్తున్నాయి.