ETV Bharat / snippets

'ఎయిర్ ఇండియా' టికెట్‌ బుకింగ్‌ ఇప్పుడు మరింత ఈజీగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 12:12 PM IST

Air India
Air India (ANI)

Air India NDC Bookings : ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ 'ఎయిర్​ ఇండియా' (Air India) సిద్ధమైంది. టికెట్‌ బుకింగ్‌ విధానాన్ని మరింత సులభతరం చేయడం కోసం కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (ఐఏటీఏ) సాయంతో 'న్యూ డిస్ట్రిబ్యూషన్‌ కెపాసిటీ' (ఎన్​డీసీ) సాంకేతికతను పరిచయం చేస్తున్నట్లు పేర్కొంది. దీనితో ఎన్‌డీసీ టెక్నాలజీతో టికెట్ బుకింగ్‌ సర్వీసులు తీసుకొచ్చిన తొలి భారతీయ విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా నిలిచింది.

ఎయిర్​ ఇండియా ఆఫర్స్​, డీల్స్, యాడ్‌-ఆన్స్​ సహా అనుకూలమైన ప్యాకేజీల పూర్తి వివరాలు ఇకపై టికెట్​ బుకింగ్‌ సమయంలోనే దర్శనమిస్తాయి. దీనితో చాలా సమయం ఆదా అవుతుంది. బుకింగ్‌ మరింత పారదర్శకంగా మారుతుంది. ఈ టెక్నాలజీ గురించి మరిన్ని విషయాలు కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఎన్‌డీసీ కస్టమర్‌ సపోర్ట్‌ సాయంతోనూ ఈ వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.