national

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 10:18 PM IST

ETV Bharat / snippets

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్‌? త్వరలోనే స్పష్టత

tamil nadu deputy cm 2024
tamil nadu deputy cm 2024 (ETV Bharat)

Udhayanidhi Stalin Deputy CM : తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యంలోనే వార్తలపై యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రి, డీఎంకే పార్టీ యూత్‌ వింగ్‌ సెక్రటరీ ఉదయనిధి స్టాలిన్​ స్పందించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.

ఉపముఖ్యమంత్రి పదవిపై సీఎం స్టాలిన్‌ నిర్ణయం తీసుకోవాలి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మా ప్రభుత్వంలోని అందరూ మంత్రులూ డిప్యూటీ సీఎంలే అని చెప్పారు. తాను నిర్వహిస్తున్న పార్టీ యువజన విభాగం కార్యదర్శి పదవి కూడా తన హృదయానికి దగ్గరగా ఉందని తెలిపారు. తమ దృష్టంతా 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని వివరించారు. మళ్లీ డీఎంకే కూటమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల్లో గెలుపునకు పార్టీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా కృషిచేయాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details