Supreme Court To Hear Marital Rape Cases : వైవాహిక అత్యాచారం కేసుల్లో భర్తలకు రక్షణ కల్పిస్తున్న చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు (సెప్టెంబర్ 24) సుప్రీంకోర్ట్ విచారణ జరపనుంది. మైనర్ కాని భార్యను బలవంతం చేస్తే, దానిని అత్యాచారంగా పరిగణించి అతడిని ప్రాసిక్యూట్ చేయాలా? వద్దా? అనే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం తేల్చనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
వైవాహిక అత్యాచారం కేసుల్లో భర్తలకు రక్షణపై - నేడు సుప్రీం కోర్ట్లో విచారణ
Published : Sep 24, 2024, 8:52 AM IST