ETV Bharat / entertainment

హీరోయిన్​తో 'కలర్ ఫోటో' డైరెక్టర్ నిశ్చితార్థం - ఫొటోలు చూశారా? - DIRECTOR SANDEEP RAJ ENGAGEMENT

'కలర్ ఫోటో' డైరెక్టర్ ఎంగేజ్మెంట్ - ఫొటోలు చేశారా?

Director Sandeep Raj Engagement
Director Sandeep Raj (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2024, 9:00 AM IST

Director Sandeep Raj Engagement : 'కలర్‌ ఫొటో' ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. టాలీవుడ్ నటి చాందినీ రావుతో తాజాగా ఆయన నిశ్చితార్థం సోమవారం జరిగింది. అయితే ఈ ఎంగేజ్‌మెంట్‌ విశాఖపట్నంలో జరిగినట్టు తెలుస్తోంది ఇక ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతుండగా, అభిమానులు నెటిజన్లు ఈ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా, డిసెంబరు ఫస్ట్ వీక్​లో ఈ జంట వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. 'కలర్‌ ఫొటో' సినిమాలో చాందినీ రావు ఓ పాత్ర పోషించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక కొంతకాలం తర్వాత ఈ జంట పెద్దల అంగీకారంతో ఒక్కటి కానున్నారు. ఇక 'హెడ్స్‌ అండ్‌ టేల్స్‌' అనే వెబ్‌సిరీస్‌లోనూ చాందిని నటించారు.

Sandeep Raj Movies : షార్ట్ ఫిల్మ్స్ నుంచి సందీప్ రాజ్ సినీ జర్నీ మొదలైంది. 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్​తో పాటు 'ముఖ చిత్రం' సినిమాలకు కథలు అందించారు సందీప్. 'కలర్‌ ఫొటో' సినిమాతో ఆయన ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో ఆయనకు ఈ జాతీయ పురస్కారం లభించింది.

ఇక సందీప్ ప్రస్తుతం రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ లీడ్​ రోల్​లో 'మోగ్లీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు మాస్ మహారాజా రవితేజ హీరోగా ఓ సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇవే కాకుండా మరికొన్ని కథలు కూడా ఆయన దగ్గర ఉన్నాయట. 2025లో ఆయన కొత్త సినిమా సెట్స్​పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఆ స్టార్స్​ లిస్ట్​లోకి సందీప్, చాందినీ!
ఇప్పటి వరకూ వివాహ బంధంతో ఒక్కటైన దర్శకుడు - హీరోయిన్ల లిస్ట్​లో కృష్ణవంశీ - రమ్యకృష్ణ, గోల్డెన్ బెహల్ - సోనాలి బింద్రేలా ఉండగా, ఇప్పుడు ఈ జాబితాలోకి సందీప్, చాందినీ చేరనున్నారు.

డైరెక్టర్​ సందీప్​రాజ్ భావోద్వేగం.. రాష్ట్రపతి చేతులు మీదుగా​ జాతీయ పురస్కారం

'ఆ చిత్రంలో లాగే నేనూ అవమానాలు పడ్డా.. హీరో కావాలనుకొని డైరెక్టర్​నయ్యా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.