Udhayanidhi Stalin Deputy CM : గత కొన్ని రోజులుగా తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మంగళవారం మీడియా సమావేశంలో పరోక్షంగా స్పందించారు. త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోందని, ఆయనకు నిరాశ ఉండదని, తప్పుకుండా మార్పు ఉంటుందని తెలిపారు.
ఇటీవలే సీఎం స్టాలిన్ ఉదయనిధికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటారని మంత్రి అన్బరసన్ వ్యాఖ్యానించారు. తాజాగా సీఎం స్టాలిన్ వ్యాఖ్యలతో ఉదయనిధికి ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమనే వార్తలు వస్తున్నాయి. కాగా, ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రి, డీఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్నారు.