ETV Bharat / state

'మా పరిధి ఇంతవరకే' - హార్ట్​ పేషెంట్​ను రోడ్డుపై వదిలేసి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ - DRIVER LEFT HEART PATIENT ON ROAD

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన - తమ పరిధి కాదంటూ గుండెపోటు రోగిని మధ్యలో దించేసిన 108 డ్రైవర్ - కారులో ఆసుపత్రికి తరలించడంతో సేఫ్

Heart Attack
Ambulance Driver Left Heart Patient on Road (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2024, 7:29 AM IST

Ambulance Driver Left Heart Patient on Road : గుండెపోటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని తమ పరిధి కాదంటూ హాస్పిటల్​కు తీసుకెళ్లకుండా అంబులెన్స్​ డ్రైవర్​ మార్గ మధ్యలోనే దింపేసిన ఘటన ఇది. మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్న ఈ ఘటన జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. కాళేశ్వరం మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన శనిగరం బాపురెడ్డి అనే వ్యక్తికి శనివారం గుండె పోటు వచ్చింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మహదేవపూర్​లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్​ ఎంజీఎంకు తరలించాలని అక్కడి వైద్యులు సూచించడంతో వెంటనే అంబులెన్స్​కు ఫోన్ చేశారు. అందుబాటులో లేదని సమాధానం రావడంతో తమకు సమీప బంధువైన మహదేవపూర్​ ప్యాక్స్​ ఛైర్మన్ చల్ల తిరుపతి కారులో రోగిని ఎక్కించుకుని బయలుదేరారు.

కారులో ఆక్సిజన్ సౌకర్యం లేకపోవడం, బాపురెడ్డి గుండెనొప్పితో తీవ్రంగా బాధపడుతుండటం చూసి చలించిపోయిన కుటుంబసభ్యులు ప్రయాణం చేస్తూనే మరోమారు అంబులెన్స్​కు ఫోన్​ చేశారు. భూపాలపల్లి సమీపంలోకి వచ్చాక 108 వాహనం రావడంతో రోగిని అందులోకి మార్చారు. సిబ్బంది అతడికి ఆక్సిజన్​ పెడుతూ కొద్ది దూరం తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాలంటూ బంధువులు డ్రైవర్​కు సూచించారు. అయితే తమ పరిధి భూపాలపల్లి వరకేనంటూ వారిని జిల్లా పాలనాధికారి సముదాయాల గేటు (నేషనల్ హైవే) వద్ద దింపేసి డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Ambulance
రోగిని తరలించిన అంబులెన్స్ ఇదే (ETV Bharat)

మా మేనేజర్ వరంగల్​ వెళ్లొద్దన్నారు : దీంతో చేసేదేమీ లేక తిరుపతి మళ్లీ తన కారులోనే రోగిని ఎక్కించుకుని వరంగల్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో చేర్పించగా, ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి క్షేమంగా బయటపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఘటనకు బాధ్యులుగా చేస్తూ 108 జిల్లా మేనేజర్, వాహన డ్రైవర్​లపై చర్యలు తీసుకోవాలంటూ ప్యాక్స్ ఛైర్మన్​ తిరుపతి జిల్లా కలెక్టర్ రాహుల్​ శర్మకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పాలనాధికారి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఎందుకు ఇలా చేశారంటూ అంబులెన్స్‌ డ్రైవర్‌ను నిలదీస్తే, తమ పరిధి ఇక్కడి వరకేనని, వరంగల్​ వెళ్లొద్దని తమ జిల్లా మేనేజర్‌ చెప్పారని చెప్పినట్లు వెల్లడించారు.

Heart Patient
వరంగల్​లోని ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి (ETV Bharat)

30 ఏళ్ల వయసులోనే గుండె నొప్పి.. కారణం ఇదేనా?

బస్సు నడుపుతుండగా గుండెపోటు - స్టీరింగ్​పైనే పడిపోయిన డ్రైవర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.