national

మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్‌- ఫిజికల్ ఫిట్​నెస్ టెస్టుల్లో మినహాయింపు

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 6:43 AM IST

Agniveers
Agniveers (ANI)

Agniveer Reservation In Paramilitary Forces :సైన్యంలో పనిచేసిన మాజీ అగ్నివీర్‌లకు కేంద్ర పారమిలిటరీ బలగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌ ప్రకటించాయి. భవిష్యత్తులో చేపట్టే కానిస్టేబుల్‌ నియామకాల్లో 10 శాతం మాజీ అగ్నివీరులకు రిజర్వ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర హోంశాఖ గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపాయి.

అగ్నిపథ్‌ పథకం చర్చనీయాంశమైన నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ నైనా సింగ్, బీఎస్‌ఎఫ్‌ అధిపతి నితిన్‌ అగర్వాల్, సీఆర్‌పీఎఫ్‌ దళపతి అనీశ్‌ దయాల్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. భవిష్యత్తులో చేపట్టబోయే కానిస్టేబుల్‌ నియామకాల్లో 10శాతం వారికి కేటాయిస్తామని తెలిపారు. శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ వీరికి మినహాయింపు ఉంటుందన్నారు. తొలి ఏడాది ఐదు సంవత్సరాలు, తదనంతరం మూడు సంవత్సరాల సడలింపు ఇస్తామని చెప్పారు

ABOUT THE AUTHOR

...view details