ETV Bharat / snippets

'కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చేయ్ - లేదంటే!' - బజరంగ్‌ పునియాకు బెదిరింపు!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 7:58 AM IST

Bajrang Punia
Bajrang Punia (ANI)

Bajrang Punia Death Threat : భారత స్టార్‌ రెజ్లర్‌, కాంగ్రెస్‌ నేత బజరంగ్‌ పునియాకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. హరియాణా ఎన్నికల వేళ హస్తం పార్టీలో చేరిన, కొన్ని రోజుల వ్యవధిలోనే ఇలా బెదిరింపులు రావడం గమనార్హం. దీనిపై సోనిపత్‌లోని బహాల్‌ఘఢ్‌ పోలీస్ స్టేషన్‌లో బజ్​రంగ్​ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ నుంచి వైదొలగాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని బజరంగ్​ను హెచ్చరించినట్లు తెలుస్తోంది.

వినేశ్‌ ఫొగాట్‌, బజరంగ్‌ పునియాలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. దిల్లీలో ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ నేతల సమక్షంలో వీరిద్దరూ హస్తం కండువా కప్పుకొన్నారు. దీనితో హస్తం పార్టీ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి వినేశ్‌ను బరిలో దించింది. పునియాను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్‌గా నియమించింది. కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ముందే వీరిద్దరూ ఇండియన్​ రైల్వేస్​లోని తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.