ETV Bharat / snippets

లాల్‌బాగ్​ గణనాథుడికి కానుకల వెల్లువ- తొలి రోజు హుండీ ఆదాయం రూ.అరకోటి!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 10:17 PM IST

Lalbaug Raja First Day Donation
Lalbaug Raja First Day Donation (ETV Bharat)

Lalbaug Raja First Day Donation : ముంబయి లాల్‌బాగ్‌ గణనాథుడి భక్తులు భారీగా కానుకలు సమర్పించుకున్నారు. శనివారం నుంచి గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. 'లాల్‌బాగ్​' గణపతి ఆలయానికి వచ్చిన విరాళాలను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగులు, గణేశ్​ ఉత్సవ్ మండల్ సభ్యులు ఆదివారం లెక్కించారు. మొదటి రోజు రూ.48.30 లక్షల కానుకలు వ్చచినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకూ గణనాథుడి పాదాల వద్ద 255 గ్రాముల బంగారంతో పాటుగా 5 కేజీల వెండి కానుకలు సమర్పించినట్లు వెల్లడించారు. ఇప్పటికే లాల్‌బాగ్​ విఘ్నేషుడికి అనంత్ అంబానీ రూ.15 కోట్ల విలువచేసే 20-కేజీల బంగారు కిరీటాన్ని సమర్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.