ETV Bharat / snippets

జమ్ముకశ్మీర్​ అభివృద్ధితో POK ప్రజలు ఇంప్రెస్! భారత్​లో కలవాలనుకుంటున్నారు! : రాజ్​నాథ్​సింగ్

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 3:45 PM IST

Rajnath Singh
Rajnath Singh (ANI)

Rajnath Singh: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలు భారత్‌లో కలవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌ విదేశీయుల్లా చూస్తోందని, తాము మాత్రం సొంతవారిలా చూసుకుంటామన్నారు. ఇటీవల ఓ కేసుకు సంబంధించి అఫిడవిట్‌ దాఖలు చేసిన పాక్‌ సొలిసిటర్‌ జనరల్‌ పీఓకేను విదేశీ గడ్డగా పేర్కొన్నట్లు రాజ్‌నాథ్‌ చెప్పారు. జమ్ముకశ్మీర్‌లోని రామ్‌బన్‌ జిల్లాలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. తమను గెలిపిస్తే 370 అధికరణను పునరుద్ధరిస్తామన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమి హామీపై రాజ్‌నాథ్‌ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం అది సాధ్యమయ్యే పనికాదని తేల్చిచెప్పారు.

370అధికరణ రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో భద్రతాపరిస్థితులు మారాయన్నారు. యువత చేతిలో గన్​లకు బదులు ల్యాప్‌టాప్‌లు కనిపిస్తున్నాయని రాజ్‌నాథ్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అంత అభివృద్ధిని చూశాక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు తాము పాకిస్థాన్‌లో ఉండబోమని, భారత్‌కు వెళ్తామంటారన్నారని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.