Yash Dayal Debut: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు బీసీసీఐ టీమ్ఇండియా జట్టును ప్రకటించింది. 16మందితో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం వెల్లడించింది. అయితే ఈ జట్టులో పేసర్ యశ్ దయాళ్ ఎంపిక అందరి దృష్టిని ఆకర్షించింది. అతడికి ఈ జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని కాదని సెలక్టర్లు దయాళ్వైపే మొగ్గు చూపారు.
అప్పుడు 5 బంతులకు 5 సిక్సర్లు- ఇప్పుడు టీమ్ఇండియా పిలుపు
2023 దాకా యశ్ దయాళ్ క్రికెట్లో ఎవరికీ పెద్దగా తెలియని పేరు. కానీ, 2023 ఐపీఎల్లో గుజరాత్- కోల్‌కతా మ్యాచ్‌తో ఒక్కసారిగా యశ్ పేరు మార్మోగిపోయింది. కానీ, అది అతడి అత్యంత పేలవ ప్రదర్శనతో. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ విధ్వంసానికి యశ్ బలైపోయాడు. తన ఓవర్లో రింకూ 5 బంతులకు వరుసగా 5 సిక్స్‌లు బాది యశ్‌కు పీడకలను మిగిల్చాడు. దీంతో యశ్‌పై అనేక విమర్శలు వచ్చాయి.
కానీ, ఒక్క ఏడాదిలోనే యశ్ టీమ్ఇండియాలో అరంగేట్రం చేస్తాడని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. ఆ సీజన్ తర్వాత యశ్ ఎక్కడా కుంగిపోకుండా ప్రాక్టీస్ కొనసాగించాడు. డొమెస్టిక్ క్రికెట్లో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. దీంతో 2024 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు అతడిని రూ.5కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో యశ్ 15 వికెట్లతో రాణించాడు. ముఖ్యంగా చెన్నైతో కీలక మ్యాచ్‌లో యశ్ అద్భుత ప్రదర్శనతో అదరహో అనిపించాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై ప్లేఆఫ్స్ చేరాలంటే చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో ధోనీ, జడేజా వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ యశ్ అద్భుత బౌలింగ్‌తో ఆర్సీబీని గెలిపించి హీరో అయ్యాడు.
" bhagwan downfall kitna bhi bura de par comeback yash dayal jaisa de"
— Sameer Allana (@HitmanCricket) September 8, 2024
from severe clinical depression in 2023 to making the indian team in 2024 ❤️ pic.twitter.com/ZvNN1Gc8PR
ఇక అదే ఫామ్‌ను డొమెస్టిక్ టోర్నీల్లో కొనసాగిస్తూ టీమ్ఇండియా పిలుపు అందుకున్నాడు. యశ్ ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్‌లు ఆడగా, అందులో 76 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా బి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు.