SC on Arvind Kejriwal Bail:దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం తెలిపింది.
సుప్రీంలో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ- బెయిల్ ఇవ్వలేమన్న కోర్ట్
Published : Aug 14, 2024, 12:28 PM IST
కాగా, ఎక్సైజ్ కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సోమవారం అత్యున్నత న్యాయస్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఆశ్రయించారు. తనను విడుదల చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వలేమని తీర్పునిచ్చింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 23కి వాయిదా వేసింది. కాగా, దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాకు ఆగస్టు 9న సుప్రీం బెయిల్ మంజూరు చేసింది.