One Nation One Election : బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఈ విడతలోనే జమిలి ఎన్నికలను అమలుచేయనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ ఎన్నికల సంస్కరణకు పార్టీలకుఅతీతంగా మద్దతు లభిస్తుందని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం వందరోజులు పూర్తి చేసుకుంది. జమిలి ఎన్నికల నిర్ణయం ఈ విడతలోనే అమల్లోకి వస్తుందని, కార్యరూపందాల్చటం తథ్యమని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
ప్రధాని మోదీ స్వాత్యంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో జమిలి ఎన్నికల ఆవశ్యకతను గట్టి చెప్పారు. తరుచుగా జరిగే ఎన్నికలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతున్నట్లు తెలిపారు. తివర్ణపతాకం సాక్షిగా దేశ ప‌్రగతికి భరోసా ఇవ్వాలని ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు.