Supreme Court On Bulldozer Action: బుల్డోజర్ సంస్కృతిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేత ఒక్కసారి జరిగినా, అది రాజ్యాంగ ధర్మానికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను కూల్చివేయరాదని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బుల్డోజర్ చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. అక్టోబరు ఒకటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఫుట్‌పాత్, రోడ్ల విస్తరణకు ఈ ఆదేశాలు వర్తించవని ఉత్తర్వుల్లో పేర్కొంది. పలు రాష్ట్రాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను చట్టవిరుద్ధంగా కూల్చివేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
అప్పటి వరకు కూల్చివేతలు వద్దు- అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమే: సుప్రీంకోర్టు
Published : Sep 17, 2024, 3:19 PM IST