Kolkata Junior Doctors Strike :మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినా నిరసనలు కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు. హత్యాచార బాధితురాలికి న్యాయం జరిగే వరకు విధుల బహిష్కరణ కొనసాగిస్తామని వెల్లడించారు . బంగాల్ ఆరోగ్య కార్యదర్శి, వైద్యవిద్య డైరెక్టర్ రాజీనామాలు కోరుతూ మంగళవారం మధ్యాహ్నం సాల్ట్ లేక్‌లోని వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యాలయమైన స్వస్థ్య భవన్‌కు ర్యాలీ చేపడతామని తెలిపారు. బాధితురాలికి న్యాయం దక్కకపోవడమే కాకుండా తమ డిమాండ్లు నెరవేరలేదని జూనియర్ వైద్యులు తెలిపారు.
నిరసన కొనసాగిస్తామన్న జూనియర్ డాక్టర్లు - సుప్రీం ఆదేశాలు ఇచ్చినా సరే!
Kolkata Junior Doctors Strike (ETV Bharat)
Published : Sep 10, 2024, 7:55 AM IST
ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచారం ఘటన జరిగిన దగ్గర నుంచి జూనియర్ వైద్యులు విధులు నిర్వహించకుండా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు కారణంగా కారణంగా 23 మంది రోగులు చనిపోయారని బంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు దృష్టికి తీసుకెళ్లింది. ఏ నిరసనైనా విధులను విస్మరించి చేయడం సరికాదని, మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని స్పష్టం చేసింది.