Actor Siddique Bail : అత్యాచారం కేసులో మలయాళ నటుడు సిద్దిఖీకి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సిద్దిఖీ తన పాస్ పోర్టును అధికారులకు అప్పగించాలని ఆదేశించింది. అలాగే దర్యాప్తులో అధికారులకు సహకరించాలని న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.
అత్యాచారం కేసులో దర్యాప్తునకు సిద్దిఖీ తమకు సహకరించలేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో కేరళ పోలీసులు పేర్కొన్నారు. సోషల్ మీడియా అకౌంట్లను తొలగించడమే కాకుండా, తన ఎలక్ట్రానిక్ డివైజ్లను సైతం ధ్వంసం చేశారని తెలిపారు. కాగా, 2016లో బాధితురాలిపై అత్యాచారం జరిగితే 8ఏళ్ల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, నటుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అత్యాచారం కేసులో నటుడు సిద్దిఖీకి ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు
Published : 8 hours ago