ETV Bharat / snippets

మహారాష్ట్ర మాజీ మంత్రి కారుపై రాళ్లదాడి - అనిల్‌ దేశ్‌ముఖ్‌కు తీవ్ర గాయాలు

Maharashtra Ex Minister
Maharashtra Ex Minister (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 12 hours ago

Maharashtra Ex Minister Attacked : అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొన్న మహారాష్ట్రలో అనూహ్య జరిగింది. ఎన్​సీపీ (ఎస్పీ) నేత, మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వాహనంపై నాగ్‌పుర్‌ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు.

నార్ఖేడ్‌లో నిర్వహించిన ఓ సమావేశానికి హాజరైన అనిల్‌ దేశ్‌ముఖ్‌ అనంతరం కటోల్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో జలాల్‌ఖేడా రోడ్‌లోని బెల్‌ఫాటా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కారుపై రాళ్లు విసరగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కటోల్‌ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనిల్‌ దేశ్‌ముఖ్ గతంలో రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. రూ.కోట్లలో లంచం డిమాండ్‌ చేశారనే ఆరోపణలు వల్ల మంత్రివర్గం నుంచి వైదొలిగారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.